INDvsENG 4th T20: బ్యాటర్లు పుంజుకునేనా? నేడు ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న T20 సిరీస్‌లో టీమ్ ఇండియా(Team India) అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 5 T20 మ్యాచ్‌ల సిరీస్‌లో సూర్యసేన 2-1 ఆధిక్యంతో ఉండటంతో ఇవాళ జరిగే నాలుగో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ వశం చేసుకోవాలని యోచిస్తోంది. పుణే(Pune) వేదికగా ఇవాళ (జనవరి 31) జరగనున్న మ్యాచ్ ఇరుజట్లకు అత్యంత కీలకం కానుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడుతోన్నా.. బౌలింగ్లో మాత్రం విజృంభిస్తోంది. కాగా సూర్యకుమార్ యాదవ్(SKY) నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఇంగ్లండ్ ఇవాళ్టి మ్యాచ్ తప్పక గెలవాలి.

పించ్ హిట్టర్ రింకూసింగ్ ఫిట్

టీమ్ ఇండియాలో అభిషేక్ శర్మ(Abhishek Sharma), తిలక్ వర్మ(Tilak Varma) మంచి ఫామ్‌లో ఉన్నారు. పించ్ హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. వెన్ను నొప్పి కారణంగా రెండో టీ20 నుంచి అతడు తప్పుకున్నాడు. ఆ తర్వాత రాజ్‌కోట్(Rajkot) మ్యాచ్‌కూ అతడు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న లెఫ్టాండ్ బ్యాటర్.. ఫిట్‌నెస్ సాధించాడు. ఇక అర్షదీప్, వరుణ్ చక్రవర్తిలు సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్(SKY) నుంచి ఇంకా కెప్టెన్సీ ఇన్నింగ్స్ రావల్సి ఉంది. కాగా ఈ మ్యాచులోనూ టాస్ కీలకం కానుంది.

Rinku Singh on batting advice from Gautam Gambhir and Suryakumar Yadav:  'Maarte jao har ball ko' | Cricket News - The Indian Express

తుది జట్ల అంచనా

INDIA: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ENGLAND: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (WK), జోస్ బట్లర్ (C), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *