
దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో(Champions Trophy final) టీమ్ఇండియా విజయం సాధించడంతో యావత్ భారవతాని పులకించిపోయింది. ODI ఫార్మాట్‌లో 8 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఈ టోర్నీలో రోహిత్ సేన ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి ఛాంపియన్‌గా అవతరించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. ‘మన ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. ICC ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తీసుకువస్తున్న మన క్రికెట్ టీమ్ ప్రదర్శన పట్ల గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం అదరగొట్టి భారత ప్రతిష్ఠను మరింత పెంచారు. అమోఘమైన ఆల్ రౌండ్ షోతో అలరించిన మన జట్టుకు శుభాభినందనలు(Congratulations)’ అంటూ మోదీ (X)లో ట్వీట్ చేశారు.
An exceptional game and an exceptional result!
Proud of our cricket team for bringing home the ICC Champions Trophy. They’ve played wonderfully through the tournament. Congratulations to our team for the splendid all round display.
— Narendra Modi (@narendramodi) March 9, 2025
రోహిత్ సేనను కొనియాడిన ఏపీ, తెలంగాణ సీఎంలు
“మన మెన్ ఇన్ బ్లూ(Men In Blue) టీమ్ సాధించిన అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి నేను కూడా హర్షిస్తున్నాను. టీమ్ఇండియా తన అసామాన్య ప్రదర్శనతో న్యూజిలాండ్ ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుని మరోమారు మనందరినీ గర్వించేలా చేసింది. టీమ్ఇండియాకు శుభాభినందనలు” అంటూ ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) ట్వీట్ చేశారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం జట్టు అంకితభావానికి, ప్రతిభకు గీటురాయి అని డిప్యూటీ సీఎం పవన్(Pawan Kalyan) పేర్కొన్నారు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలిచిన రోహిత్ సేనకు కంగ్రాచ్యులేషన్స్ అని మంత్రి లోకేశ్(Lokesh) కొనియాడారు. హార్డ్ వర్క్, అంకితభావంతో అద్బుతమైన విజయం సాధించినందుకు భారత జట్టుకు కంగ్రాట్స్ అని తెలంగాణ సీఎం రేవంత్(TG CM Revanth Reddy) తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలవడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
సినీ ప్రముఖల అభినందనల వెల్లువ
ఇక ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కప్ తీసుకొచ్చిన టీమ్ఇండియాపై టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం స్పందించారు. గర్వంగా, అమితానందంగా ఉంది. కంగ్రాట్స్ టీమ్‌ఇండియా అని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్వీట్ చేశారు. అలాగే మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, అల్లు అర్జున్, డైరెక్టర్ రాజమౌళి, వెంకటేశ్, రవితేజ, సాయి దుర్గా తేజ్, రవితేజ తదితరులు టీమ్ఇండియా విక్టరీని కొనియాడుతూ ట్వీట్లు చేశారు.
Proud and Overjoyed !! 👏👏👏
Congratulations Team India!!
India – The Champions!!!Jai Hind !! 🇮🇳 #ChampionsTrophy2025 pic.twitter.com/lxDIzPHGaA
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 9, 2025