ప్రముఖ బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ(Deb Mukherjee) కన్నుమూసిన సంగతి తెలిసిందే. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా అనారోగ్యంతో ముంబై(Mumbai)లోని ఓ ప్రైవేటు చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అయితే దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిన్న ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటిక(Pawan Hans Crematorium)లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రిటీలు(Bollywood Celebrities) హాజరై నివాళులు అర్పించారు.
అయాన్‌ను ఓదార్చిన రణ్‌బీర్
ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) సైతం హాజరయ్యాడు. అక్కడ దేబ్ ముఖర్జీ పాడెను రణ్‌బీర్ మోశాడు. అనంతరం తండ్రిని కోల్పోయిన అయాన్‌ను ఓదార్చారు. కాగా దేబ్ ముఖర్జీ అనేక చిత్రాలలో నటించి మెప్పించారు. అలా ‘ఏక్ బార్ మూస్కురా దో’, ‘జో జీతా వోహి సికందర్’, ‘లాల్ పత్తర్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
View this post on Instagram








