‘ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్’ కీలక అప్​డేట్.. అలా చేస్తే మీరు అనర్హులే!

తెలంగాణ సర్కార్ (Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్లు పథకం’ (Indiramma Illu Scheme)పై కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపట్టే గృహ నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం మించితే అనర్హుల కిందే గుర్తిస్తున్నారు. అవగాహన లోపంతో ఉన్నంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన వారు ఈ విషయం తెలిసి ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. అయితే ఇంటి నిర్మాణంపై, ఈ పథకంపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోందని లబ్దిదారులు వాపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ 

ఇందిరమ్మ ఇళ్లు పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం (Own Land) కలిగి ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకోసం లబ్దిదారులకు పలు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. కొందరు మాత్రం 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టిన వారికి  మొదటి విడతగా పునాది స్థాయిలో చెల్లించే రూ.లక్ష నిలిపివేస్తున్నారు.

వారికి చెల్లింపులు కట్

600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని అందుకే వారికి ఈ పథకం (Indiramma Housing Scheme) వర్తించదని చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే తాము సొంత స్థలం ఉందని నిర్మాణం చేపట్టామని.. కానీ తాము ధనికులం కాదని 600 చదరపు అడుగుల స్థలం మించి ఇల్లు నిర్మించిన వారు వాపోతున్నారు. అవగాహన లేక తప్పు చేశామని.. నిబంధనలు తెలిసుంటే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *