
తెలంగాణ(Telangana)లోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. భోగి(Bhogi) పండగను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్(Indiramma Model House)ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పేదోడి సొంతింటి కల నేరవేరలేదని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి APలో 25 లక్షల ఇళ్లు కట్టిన చరిత్ర కాంగ్రెస్(Congress)దని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రూ.5లక్షలతో నిర్మించిన మోడల్ హౌస్ వసతులు, ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు.
వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తాం
గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి అర్హుడికి సొంతింటిని నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం(Assembly Constituency)లో 3500 ఇళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. వీటిని పార్టీలకు అతీతంగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికలో ఎవరి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా(Rythu Bharosa), కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) ఇస్తామని తెలిపారు. ఇక భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు త్వరలోనే అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి పొంగులేటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
పాలేరు నియోజకవర్గ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు pic.twitter.com/bS34BxPiJQ
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) January 13, 2025