ప్రపంచ టెక్ రంగంలో ఉద్యోగ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్(Microsoft), ఇన్ఫోసిస్(Infosys) వంటి దిగ్గజ కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించగా, తాజాగా చిప్(Chip) తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్ (Intel) కూడా అదే దారిలో నడుస్తోంది. ఖర్చుల తగ్గింపు చర్యల నేపథ్యంలో ఇంటెల్ సుమారు 5,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు(Employees layoffs) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రక్రియ కొత్త సీఈఓ లిప్-బు టాన్(CEO Lip-Bu Tan) నాయకత్వంలో జరుగుతోంది. ఈ మేరకు కాలిఫోర్నియా, ఒరెగాన్, ఆరిజోనా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఈ తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి.
ఖర్చులను తగ్గించి, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో
కాగా ఒరెగాన్‌లో 2,932, కాలిఫోర్నియా(California)లో 1,935, ఆరిజోనా(Arizona)లో 696 ఉద్యోగాలు కోల్పోతున్నాయి. ఈ చర్యలు కంపెనీ ఖర్చులను తగ్గించి, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంటెల్ CPU, AI GPU మార్కెట్లలో నీవిడియా, AMDడీలతో పోటీలో వెనుకబడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో 20%కి పైగా తొలగించాలనే యోచనతో, ముందస్తుగా ఈ తొలగింపులు చేపట్టింది.
దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆదాయ ప్రయోజనం
ఈ చర్యల ద్వారా ఈ ఏడాది సుమారు 500 మిలియన్ డాలర్ల ఖర్చులు తగ్గించాలన్నది లక్ష్యం కాగా, 2026 నాటికి దాదాపు 3 బిలియన్ డాలర్ల ఆదాయ ప్రయోజనం పొందాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే టెక్నాలజీ, AI, ఫౌండ్రీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతూ, అవసరం లేని విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించేందుకు సంస్థ దృష్టి సారించింది. తొలగింపులకు గురైన ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీలు, హెల్త్ బెనిఫిట్స్(Health Benefits) వంటి పరిహారాలు అందించనున్నట్లు ఇంటెల్ స్పష్టం చేసింది.
Intel has laid off over 5,000 employees in the United States this July, quadrupling earlier projections and sending a strong signal that the tech giant is undergoing a major transformation.https://t.co/BXpqxFMv4J pic.twitter.com/pkwTGVgaN9
— NWN GH (@nwn_gh) July 17, 2025






