
తెలంగాణలోని ఇంటర్మీడియట్(Intermediate) ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు(Inter Advanced Supplementary Exams) జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష(Inter-First Year Exams) కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు(Secondary Exams) నిర్వహిస్తారు. ఆదివారం సైతం పరీక్ష కొనసాగనుంది.
సెంటర్లకు అరగంట ముందుగానే చేరుకోవాలి..
ఇక విద్యార్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు ఇంటర్ బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య(Inter Board Secretary Krishna Aditya) సూచించారు. కాగా ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం(Evaluation) ప్రారంభమవుతుంది. ఇక జూన్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్(Practical exams) ఉంటాయి.