మరో రెండు రోజుల్లో ధనాధన్ క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2025) 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే, 2008లో ప్రారంభమైన IPLలో ఇప్పటివరకు వేలాది మంది క్రికెటర్లు ఆడారు. కానీ, కొందరు మాత్రమే ఆరంభ సీజన్ నుంచి రాబోయే 18వ ఎడిషన్‌లో కూడా ఆడనున్నారు. మరి ఆ ప్లేయర్లు ఎవరో ఓ లుక్ వేద్దామా..

18వ ఎడిషన్‌లోనూ ఆడుతోంది వీరే..
1.మహేంద్ర సింగ్ ధోనీ (CSK)
2. విరాట్ కోహ్లీ (RCB)
3. రోహిత్ శర్మ (2008లో డెక్కన్ ఛార్జర్స్, ఇప్పుడు MI),
4. రవీంద్ర జడేజా (RR తరఫున అరంగేట్రం.. ఇప్పుడు CSK)
5. రవిచంద్రన్ అశ్విన్ (CSK)
6. ఇషాంత్ శర్మ(KKR తరఫున ఎంట్రీ.. ఇప్పుడుG T)
7. అజింక్య రహానె (ప్రారంభ సీజన్‌లో MIకి ప్రాతినిధ్యం.. ఇప్పుడు KKR కెప్టెన్)
8. మనీశ్ పాండే (ప్రారంభ సీజన్‌లో MI, ఇప్పుడు KKRకు ప్రాతినిధ్యం)
ఎక్కువ టైటిళ్లు నెగ్గింది ఆ జట్లే..
కాగా ఇప్పటి వరకూ 17 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌గా 15 సార్లు, పుణే సూపర్ జెయింట్స్‌గా 2సార్లు ఐపీఎల్‌లో తలపడిన CSK 12 సార్లు ప్లేఆఫ్స్ చేరడమే కాక 5సార్లు టైటిల్ గెలిచింది. 4సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇవన్నీ ధోనీ(MSD) సారథ్యంలోనే కావడం గమనార్హం. ఇక చెన్నైతో సమానంగా ఐపీఎల్ టైటిళ్లను ఐదుసార్లు నెగ్గిన జట్టు ముంబై ఇండియన్స్. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ముంబై ఎంతో బలంగా ఎదిగింది. ఇక ఆ తర్వాత KKR 3, RR, SRH, GT, డెక్కన్ ఛార్జెస్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.






