ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్న 1574 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ(BCCI) లిస్ట్ అవుట్ చేసింది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు పలువురు కీలక ప్లేయర్లను వేలంలో దక్కించుకునేందుకు పోటీపడనున్నాయి. దీంతో ఈ సారి జరిగే ఆక్షన్(Auction) రసవత్తరంగా సాగడం ఖాయం. వచ్చే సీజన్ కోసం నవంబర్ 24,25 తేదీల్లో జెడ్డాలో ఈ మెగా ఆక్షన్ జరగనుంది. పది ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ రిటైన్ చేసిన జాబితాను ప్రకటించాయి. స్టీవ్ స్మిత్, జో రూట్(Steve Smith, Joe Root) వంటి స్టార్ ఆటగాళ్లు గత వేలంలో అమ్ముడుపోకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి ప్రాంచైజీలు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఆసక్తి చూపించనున్నాయి. అయితే ఈసారి కొందరు ప్లేయర్లకు నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. వారెవరంటే..
వీరికి అవకాశాలు తక్కువే..
* ఇషాంత్ శర్మ
* రెజా హెండ్రిక్స్,
* అకేల్ హుస్సేన్
* ఇష్ సోథి
* తబ్రైజ్ షంసీ
* క్రిస్ లిన్
* జేమ్స్ అండర్సన్
* అమిత్ మిశ్రా
* ఆకాశ్ మద్వాల్
* జో రూట్
* స్టీవ్ స్మిత్
* జాసెన్ రాయ్
తదితర ప్లేయర్లను తీసుకునేందుకు ఈ సారి ఆయా ఫ్రాంచైజీలు(Franchises) ఆసక్తి చూపకపోవచ్చని క్రిక్‌బజ్ తెలిపింది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు తమ టాలెంట్‌తో దూసుకొస్తున్నారు. పైగా కొందరిలో బౌలింగ్, బ్యాటింగ్(ALL Rounders) రెండూ చేసే సత్తా కూడా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లను తీసుకుంటే తాము నష్టపోతామని, వారు ఫీల్డింగ్‌లోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయట. మరి ఈనెల 24, 25 తేదీల్లో జరగబోయే వేలంలో వీరిలో ఎవరు జాక్ పాట్ కొడతారో వేచి చూడాలి.
ఆ ఐదు జట్లకు కొత్త కెప్టెన్లు
ఇదిలా ఉండగా వచ్చే IPL సీజన్ కోసం ఫ్రాంఛైజీలు సన్నాహాలు మొదలుపెట్టాయి. మెగా వేలం(Mega Auction)కు సంబంధించి ఇప్పటికే లిస్ట్‌లను విడుదల చేశాయి. ఈసారి మెగా వేలంతో జట్ల స్వరూపం పూర్తిగా మారనుంది. కొత్త ప్లేయర్లతో పాటు కొత్త కెప్టెన్లు కూడా కనిపించనున్నారు. చాలా మంది ఆటగాళ్లు వేలంలో టీమ్స్ మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జట్లకు కెప్టెన్ల మార్పులు తప్పని సరిని తెలుస్తోంది. ఇందులో RCB, DC, LSG, KKR, PB జట్లకు కొత్త కెప్టెన్స్ రానున్నారు.






