IPL Mega Auction: ఐపీఎల్ మెగావేలం.. కోట్లు కొల్లగొట్టేది ఎవరో?

అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా వేలాని(IPL mega auction)కి సంబంధించి BCCI అప్డేట్ ఇచ్చింది. మెగా వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల లిస్టు(official player list)ను రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 574 మంది ఆటగాళ్లు ఉండగా భారత్(India) నుంచి 366 మంది ఉన్నారు. ఇక 208 మంది విదేశీ ప్లేయర్లు, మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే భారత నుంచి 318 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు బరిలో నిలవగా.. విదేశాలకు చెందిన 12 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 204 స్లాట్లకు వేలం జరగనుంది. ఇందులో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌(Base price)లో మొత్తం 81 మంది నిలవడం గమనార్హం. కాగా ఈనెల 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం(IPL mega auction) జరగనుంది.

 బేస్ ప్రైస్‌లో ఉన్న ప్లేయర్లు

☛ రూ. 2 కోట్లు – 81 మంది ప్లేయర్లు
☛ రూ.1.5 కోట్లు -27 మంది ప్లేయర్లు
☛ రూ.1.25 కోట్లు – 18 మంది ఆటగాళ్లు
☛ రూ. కోటి – 23 మంది ప్లేయర్లు
☛ రూ. 75 లక్షలు – 92 మంది ఆటగాళ్లు
☛ రూ. 50 లక్షలు – 8 మంది ప్లేయర్లు
☛ రూ.40 లక్షలు – ఐదుగురు ఆటగాళ్లు
☛ రూ.30 లక్షలు – 320 మంది ప్లేయర్లు

కాగా ఈనెల 24న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది.

✎ సెట్-1లో ఉన్న ప్లేయర్లు
శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ

✎ సెట్-2లో ఉన్న ప్లేయర్లు
చాహల్, లివింగ్‌స్టోన్, మిల్లర్, కేఎల్ రాహుల్, షమీ, సిరాజ్

✎ సెట్-3లో ఉన్న ప్లేయర్లు
బ్రూక్, కాన్వే, జెక్ ఫ్రేజర్, మార్క్రమ్, పడిక్కల్, త్రిపాఠీ, వార్నర్

✎ సెట్-4లో ఉన్న ప్లేయర్లు
వెంకటేశ్ అయ్యర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, స్టోయినిస్, అశ్విన్

✎ సెట్-5లో ఉన్న ప్లేయర్లు
బెయిర్‌స్టో, డికాక, సాల్ట్, జితేశ్ శర్మ, ఇషాన్, గుర్బాజ్

✎ సెట్-6లో ఉన్న ప్లేయర్లు
బౌల్ట్, హేజిల్‌వుడ్, నటరాజన్, నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్

✎ సెట్-7లో ఉన్న ప్లేయర్లు
హసరంగ, తీక్షణ, జంపా, చాహర్, నూర్ అహ్మద్, సలామ్ ఖీల్

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *