
అమెరికా సైనిక స్థావరాల(US military bases)ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడుల(Iranian retaliatory attacks)కు దిగిన నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) కీలక ప్రకటన చేసింది. గల్ఫ్(Gulf) ప్రాంతం మీదుగా ప్రయాణించే తమ విమాన సర్వీసులన్నింటినీ తక్షణమే రద్దు(Cancellation) చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తదుపరి ప్రకటన వెలువడే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
టేకాఫ్ అయిన కొన్ని విమానాలూ వెనక్కి మళ్లింపు
పశ్చిమాసియా(Middle East)లోని దేశాలు, ఉత్తర అమెరికాలోని తూర్పు తీర నగరాలు, యూరప్‌కు నడిపే విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది. ఇప్పటికే ఉత్తర అమెరికా(North America) నుంచి భారత్‌కు బయలుదేరిన కొన్ని విమానాలను వెనక్కి మళ్లించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత్(India) నుంచి టేకాఫ్ అయిన కొన్ని విమానాలను కూడా ఇతర మార్గాల ద్వారా వెనక్కి రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఎయిరిండియా(Air India) వివరించింది.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా..
మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్(Dubai), దోహా, బహ్రెయిన్, దామమ్, అబుదాబీ, కువైట్, తిబ్లిసీ వంటి నగరాల నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన(Indigo flights) సర్వీసులపైనా ప్రభావం పడింది. తాము కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఇండిగో సంస్థ పేర్కొంది. కాగా తమ అణు కేంద్రాలపై US జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్(Iran) సోమవారం రాత్రి ఖతార్(Khatar)లోని అల్-ఉదెయిద్ అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనతో ఖతార్ రాజధాని దోహాలో తీవ్ర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన బాంబు దాడులకు ప్రతిగా ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టం చేసింది.
The panic of Qatari citizens at the moment of the attack in a Doha mall. pic.twitter.com/HZCYRi8jZN
— Brian’s Breaking News and Intel (@intelFromBrian) June 23, 2025