తెలంగాణ రాష్ట్రం IT, ఫార్మా(Pharma) రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తోందని, అలాంటిది గంజాయి, డ్రగ్స్(Drugs)కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని(International Anti-Drug Day) పురస్కరించుకుని గురువారం సాయంత్రం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన సదస్సులో ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సదస్సులో నిర్మాత దిల్‌రాజు(Dil Raju), చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్(Gopi Chand), హీరోలు రామ్ చరణ్(Ram Charan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తదితరులు పాల్గొన్నారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the International Day Against Drug Abuse and Illicit Trafficking 2025 programme at Shilpakala Vedika, Hyderabad https://t.co/aPLKHszvrl
— Telangana CMO (@TelanganaCMO) June 26, 2025
తెలంగాణ అంటేనే ఉద్యమాలు, పోరాటాలకు పురిటిగడ్డ
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్రగ్స్ మాఫియా(Drug Mafia)కు గట్టి హెచ్చరిక చేశానని, తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు కన్నెత్తి చూసినా వారి వెన్ను విరుస్తామని స్పష్టం చేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘తెలంగాణ అంటేనే ఉద్యమాలు, పోరాటాలకు పురిటిగడ్డ. అలాంటి గడ్డ డ్రగ్స్‌కు నిలయంగా మారితే అది రాష్ట్రానికే అవమానకరం’’ అని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారు తెలంగాణ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాలంటేనే వణికిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రుల(Ministers)కు, పోలీసు ఉన్నతాధికారుల(Police Officialsకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ విభాగం ఏర్పాటు
డ్రగ్స్ నిర్మూలన(Drug Eradication) కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, పౌరులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో పిల్లల ప్రవర్తనను గమనించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సబ్జెక్టు టీచర్లు, PETలతో పాటు ‘బిహేవియర్ అబ్జర్వర్స్(Behavior Observers)’ను కూడా నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ‘ఈగల్(Eagle)’ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ‘ఈగల్’ బృందం నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు.
EAGLE…
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.శిక్షణ పొందిన… pic.twitter.com/veqcwzLJ9G
— Revanth Reddy (@revanth_anumula) June 26, 2025






