
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma) గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. రెండేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టేసి.. ఇకపై ఫ్రెండ్స్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ జంట విడిపోవడానికి కారణమేంటని అందరూ తెగ ఆలోచిస్తున్నారు.
బ్రేకప్ కారణం అదేనట
అయితే ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ కొన్ని కథనాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. కెరీర్, పెళ్లి (Tamannaah Vijay Marriage) విషయంలో ఈ జంట మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం. అందువల్లే వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా.. పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటోందట. కానీ విజయ్ వర్మ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరీర్ లో చాలా బిజీగా ఉన్నాడు. వరుస పెట్టి ఆఫర్లు వస్తుండటంతో ఈ సమయంలో కెరీర్ పై ఫోకస్ చేయాలని భావిస్తున్నాడట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని బీటౌన్ కోడై కూస్తోంది.
బ్రేకప్ తో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్
2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ – 2 (Lust Stories 2)’ కోసం తమన్నా-విజయ్ తొలిసారి కలిసి పని చేశారు. ఈ సిరీస్ షూటింగు సమయంలోనే ఈ జంట ప్రేమలో పడింది. ఇక కొంతకాలం తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఈ జంట తర్వాత సినిమా ఈవెంట్స్, ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాలకు వీరిద్దరూ కలిసి వెళ్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఈ జంట విడిపోయారంటూ నెట్టింట బ్రేకప్ స్టోరీలు రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే నెట్టింట వైరల్‌గా మారిన ఈ వార్తలపై తమన్నా, విజయ్ వర్మ స్పందించలేదు.