మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పొలిటికల్ రీ ఎంట్రీ(Political Re-Entry)కి రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనలను కారణాలుగా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఢిల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల(Sankranti Celebrations)కు మెగాస్టార్‌ను ఆహ్వానించారు. అలాగే ప్రధాని మోదీ(PM Modi)ని సైతం ఈ వేడుకల్లో భాగం చేశారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన వీడియోలు, ఫొటోల్లో చిరంజీవి, ప్రధాని మోదీ అత్యంత సన్నిహితంగా కనిపించడం, ఒకరిచేతులు మరొకరు పట్టుకోవడం, నవ్వుతూ కనిపించడం వంటివి చిరుని పొలిటికల్ రీ ఎంట్రీ కోసమే కమలదళం రెడీ చేస్తోందన్న వార్తలు ఊపందుకున్నాయి.
సంక్రాంతి వేడుకలే పునాదా?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు 2028 ఎన్నికలకు(Elections-2028) కొత్త రాజకీయ సమీకరణలకు పునాది వేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో BJP తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇందుకు మెగాస్టార్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న లీడర్లను తమ టీమ్‌లోకి తీసుకొని ముందుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు టాక్. తెలంగాణలో BRS వైఫల్యం, ప్రజల్లో కాంగ్రెస్(Congress)పై రోజురోజుకూ సన్నగిల్లుతోన్న విశ్వాసం..తాజాగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు వంటివి BJPకి సానకూలంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్‌పై మోదీకి ప్రత్యేక అభిమానం
ఇదిలా ఉండగా చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇప్పటికే బీజేపీతో బాగా దగ్గరగా ఉన్నారు. ఆయనకు సొంతంగా జనసేన(Janasena) పార్టీ ఉన్నా BJP, జనసేన ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాన్ పార్టీ జనసేన అయినప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం అతనిని వేరుగా చూడడం లేదు. పవన్ కళ్యాన్‌పై మోదీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాన్ కూడా మోదీని తన నాయకుడిగానే భావిస్తారు. బీజేపీ ఇప్పటికే పవన్ ద్వారా APలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ తెరపైకి రావడం, ఆయనకు గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి ఇస్తారనే వార్తలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.









