టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేలా చేసిన చిత్రం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్, రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇందులో నటుడు ప్రియదర్శి చేసిన కామెడీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింట్ ఉంది. నా సావు నేను సస్తా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటివరకూ ఎక్కడో అక్కడా వినిపిస్తూనే ఉంటుంది. మరి ఇంతటి పాపులారిటీ తెచ్చుకున్న ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది.
సీక్వెల్ కు భారీ ప్లానింగ్
ప్రేక్షకుల కోరికే మేరకు ‘పెళ్లి చూపులు (Pelli Choopulu)’ సినిమాకు సీక్వెల్ తీసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఈ సీక్వెల్ పై ఒక్క అప్డేట్ లేదు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ మొదట ఆయన తీసిన ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)’ సినిమాకు సీక్వెల్ తీయాలని భావించారట. అందుకోసం స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అది పక్కనపెట్టి పెళ్లి చూపులు సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
విజయ్ ఓకే అంటాడా?
అయితే పెళ్లిచూపులు సినిమాతోనే విజయ్ దేవరకొండకు సూపర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి (Arjun Reddy) మాసివ్ హిట్ విజయ్ కాస్త ది విజయ్ దేవరకొండ అయిపోయాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండను ఇప్పుడు ప్రేక్షకులు పెళ్లి చూపులు వంటి చిన్న సినిమాలో హీరోగా చూడగలుగుతారా అన్నది ప్రశ్న. మరోవైపు ప్రస్తుతం విజయ్ కు ఉన్న క్రేజ్ చూస్తే ఆయన ఈ సినిమా చేసేందుకు ఓకే చెబుతాడా అన్నది కూడా డౌటే. మరి విజయ్ ఓకే అనకపోతే తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వేరే హీరోను చూసుకుంటాడా.. లేక సీక్వెల్ ప్లాన్ క్యాన్సిల్ చేస్తాడా అన్నది చూడాల్సి ఉంది.






