
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) కాంబోలో తెరకెక్కుతోన్న విజువల్ వండర్ మూవీ ‘విశ్వంభర(Vishwambhara)’. ఈ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో సీనియర్ నటి త్రిష కృష్ణన్(Trisha Krishnan) చిరుకి జంటగా నటిస్తోంది. అలాగే ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్(Ashika Ranganath), రమ్య పసుపులేటి విశ్వంభర మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం బాధ్యతలను ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి నిర్వహిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ గిఫ్ట్‌గా మే 9న థియేటర్లలోకి రానున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.
విశ్వంభరకు హిందీలోనూ ఫుల్ క్రేజ్
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ మూవీకి తెలుగుతోపాటు హిందీ(Hindi)లోనూ ఫుల్ క్రేజ్ ఏర్పడింది. దీంతో విశ్వంభర హిందీ రైట్స్(Hindi Rights)కు రూ.38కోట్లకు అమ్ముడుపోయినట్లుగా టీటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ హిందీ డీల్‌తో చిరు మూవీకి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడినట్లేనని మేకర్స్(Makers) భావిస్తున్నారు.
వింటేజ్ లుక్‌తో ఆకట్టుకున్న చిరు
ఇదిలా ఉండగా విశ్వంభర నుంచి రిలీజైన పోస్టర్(Poster)లో చిరంజీవి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో విశ్వంభర నిర్మాణంలో గ్రాఫిక్ వర్క్స్(VFX) సహా దేనిలోనూ రాజీ పడకుండా చూస్తున్నారు మేకర్స్. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషన్స్(Hollywood Technicians)ను రంగంలోకి దింపారు. రూ.100కోట్ల మేరకు ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు. విశ్వంభర సినిమాను దర్శకుడు “జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ వశిష్ట. దీంతో మూవీ విడుదల కోసం మెగా ఫ్యాన్స్(Mega Fans) ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.