
క్రియేటివిటీ ఉండొచ్చు.. కానీ అది లిమిట్స్ దాటకూడదు. తాజాగా ఓయో హోటల్స్(OYO Hotels) ఇలాంటి పనే చేసి మరోసారి చిక్కుల్లో పడింది. దీంతో బాయ్ కాట్ ఓయో హ్యాష్ ట్యాగ్ (#BoycottOYO) సోషల్ మీడియా(SM)లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే.. హిందూ దేవుడిపై ప్రకటన రూపొందించడంపై ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓయో విడుదల చేసిన ప్రకటనలో “భగవాన్ హర్ జగహ్ హై” అనే ట్యాగ్‌లైన్ ఉంది. “దేవుడు ప్రతిచోటా ఉన్నాడు “అని దీనర్థం. దీనికి నేరుగా దిగువన “ఔర్ ఓయో భీ” అని ఉంది. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ అయితే ఉన్నాడో.. అక్కడ ఓయో కూడా ఉందన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటనపై నెటిజన్లు ట్విటర్ (X)వేదికగా ఆ సంస్థపై విరుచుకుపడుతున్నారు. బాయ్ కాట్ ఓయో అంటూ పోస్టులు(Posts) పెడుతున్నారు. అలాగే హిందూ సంఘాల ప్రతినిధులు (Representatives of Hindu communities) కూడా మండిపడుతున్నారు. ఓయోను బ్యాన్(BanOYO) చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
#BoycottOYO 🚨
Gkm6OYO की हरकतें अब कानून के दायरे में आनी चाहिए! सिर्फ माफी से काम नहीं चलेगा, इस पर सख्त कानूनी कार्रवाई होनी चाहिए ताकि भविष्य में कोई हिंदू आस्था का अपमान करने की हिम्मत न करे! pic.twitter.com/QSQDWXphJY
— सनातनी हिंदू मनीष प्र.स.® (E&SWS) (@TiwariM69906697) February 21, 2025
ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు.
తమ ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఓయో యాజమాన్యం(OYO Management) దిగొచ్చింది. తాము ఇచ్చిన ప్రకటన కేవలం దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తప్పితే.. ఏ మతాన్ని ఉద్దేశించి కాదని.. ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడానికి కాదని స్పష్టం చేసింది. సంప్రదాయాలకు నెలవైన భారత్(India)లో నమ్మకాలు, విశ్వాసాల పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది.