Pushpa-2 Collections: రూ.531 కోట్లకుపైగా తేడా.. ఐటీ రైడ్స్ అందుకేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప2(Pushpa-2). డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్, నిర్మాతల ఇళ్లల్లో ఐటీ రైడ్స్(IT Rides) జరుగుతున్నాయి. దీంతో పుష్ప2 అసలు కలెక్షన్లు(Collections) ఎంత అనే చర్చ మొదలైంది. ఒక్క బాలీవుడ్‌లో రూ. 806 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లును సాధించినట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా పోస్టర్స్(Posters) విడుదల చేశారు. ఈనేపథ్యంలోనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ల ఇళ్లు, ఆఫీసులపై IT దాడులు మొదలయ్యాయని సినీ వర్గాల్లో టాక్.

డైరెక్టర్ సుకుమార్‌కి షేర్ ఉందా?

పోస్టర్‌పై వేసిన కలెక్షన్స్‌కు సంబంధించిన ప్రతి రూపాయి లెక్క అడిగి దర్శక, నిర్మాతలను పలు ప్రశ్నలతో ఐటీ అధికారులు(IT Officers) ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 నిర్మాణంలో డైరెక్టర్ సుకుమార్‌(Sukumar Shares)కి షేర్స్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో, SVC, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. అసలు సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? వచ్చిన ఆదాయం ఎంత? అనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

IT raids 'Pushpa 2' director Sukumar's Hyderabad home and office after  'Game Changer' producer Dil Raju, netizens slam fake box-office collections  – Firstpost

పోస్టర్స్‌కి.. వాస్తవానికి తేడా ఉందా?

ఇదిలా ఉండగా పుష్ప-2 రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు నిర్మాతలు పోస్టర్స్(Posters) ను విడుదల చేశారు. కానీ తీరా లెక్కల్లో దాదాపు రూ.531 కోట్లకు పైగా తేడా వచ్చినట్టు IT అధికారులు గుర్తించారట. కొంతమంది అల్లు అర్జున్‌ ఫ్యాన్స్(Fans) పుష్ప-2 సినిమా రూ.2200 కోట్లు వసూళ్లు చేస్తే.. నిర్మాతలు కేవలం రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసినట్టు మాత్రమే పోస్టర్స్ వేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మాత్రం.. పుష్ప-2 మూవీకి సంబంధించి రూ.1250 కోట్ల గ్రాస్‌కు మాత్రమే టాక్స్ చెల్లించినట్టు సమాచారం. ఈ సందేహంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది. మరి పుష్ప-2 కలెక్షన్స్ ఎంత? లేక నిర్మాతలు ఎక్కువ మొత్తంలో టాక్స్‌ ఎగ్గొట్టారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *