తమిళ నటుడు ఆర్య (Aarya) ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం చెన్నైలోని నివాసంతోపాటు అన్నానగర్, పలు ప్రాంతాల్లో ఉన్న ఆర్యకు చెందిన సీ షెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేపట్టారు. మధ్యాహ్నం వరకు కూడా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులను ఉద్దేశించి ఆర్య స్పందించారు. సీ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని ఆయన స్థానిక మీడియాతో చెప్పారు. ఈ హోటళ్ల నిర్వహణ బాధ్యతను ఆయన కొన్నేళ్ల క్రితమే మరో వ్యక్తికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆర్య ఇంటిలో ఐటీ రైడ్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Income Tax officials conducted #raids today at the residence and business establishments of actor #Arya in #Chennai. pic.twitter.com/FpG4QLmOnT
— Hyderabad Times (@HydTimes) June 18, 2025






