హైదరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ నేతల ఇళ్ళే టార్గెట్ గా ఐటీ దాడులు చేసింది. కాంగ్రెస్‌ నేత పారిజాత ఇంటిపై ఐటీ దాడులు చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ నేతల ఇళ్ళే టార్గెట్ గా ఐటీ దాడులు చేసింది. కాంగ్రెస్‌ నేత పారిజాత ఇంటిపై ఐటీ దాడులు చేసింది. బడంగ్‌పేట్‌ కార్పొరేటర్‌గా పారిజాత ఉన్నారు. మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ ను ఆమె ఆశించించారు. మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే కిచెన్న గారి లక్ష్మా రెడ్డి ఇంట్లో కూడా ఐటీ రైడ్స్ నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుండి సోదాలు కొనసాగుతున్నాయి. కేఎల్ఆర్ ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన నివాసం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తుక్కుగూడలో కేఎల్‌ఆర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.మరోవైపు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్ బాగ్‌లో కేఎల్ఆర్ ఫామ్ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాల్లో పలు ఫామ్ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలో ఎన్సిసీలో కూడా విల్లా ఉన్నట్టు సమాచారం.

ఇక ఈరోజు ఉదయం 5గంటలకే పారిజాత ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు అప్పటి నుంచి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Related Posts

Modi 3.0: దేశంలో NDA దురహంకారం ఇక పనిచేయదు.. మోదీ 3.0 ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Mana Enadu: దేశంలో ప్రస్తుతం యూ టర్న్(U-Turn) ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె(Congress National Spokesperson Supriya Srinathe) అన్నారు. ప్రభుత్వ దురహంకారం ఇక పని చేయదని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. దేశంపై ప్రభావం…

నేను సేఫ్.. నన్నెవరూ ఆపలేరు : డొనాల్డ్ ట్రంప్

ManaEnadu:రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్డొ డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​పై మరోసారి హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ సాయుధుడు గోల్ఫో కోర్టువైపు తుపాకీ ఎక్కుపెట్టగా సీక్రెట్ ఏజెంట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *