
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) తాజాగా తన పెళ్లి(Marriage), ప్రేమ(Love) రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా(SM)లో ఆమె పెళ్లి గురించి, ప్రముఖ హీరోలతో డేటింగ్ రూమర్ల(Dating Rumours) వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ, తన దృష్టి ప్రస్తుతం సినిమాలు(Movies), చదువు(Education)పైనే ఉందని స్పష్టం చేసింది. “అమ్మ పక్కనుంటే నేనెలా ప్రేమిస్తాను? పెళ్లి గురించి ఆలోచించే సమయం ఇది కాదు. నా ఫోకస్ సినిమాలు, MBBS చదువుపై ఉంది” అని ఆమె క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల ఇటీవల తన 24వ బర్త్ డే(Birth Day) సందర్భంగా హల్దీ, కుంకుమ సంబరాలతో కనిపించిన ఫొటోలు వైరల్ కావడంతో, ఆమె నిశ్చితార్థం(Engagement) జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి.
మా ఇంట్లో బర్త్ డేలను అలాగే జరుపుకుంటాం..
అయితే, ఇవి కేవలం సంప్రదాయ పుట్టినరోజు వేడుకల్లో భాగమని, పెళ్లి లేదా నిశ్చితార్థం కాదని ఆమె స్పష్టం చేసింది. “మా ఇంట్లో బర్త్ డేలను ఇలా సంప్రదాయబద్ధం(Birthday Celebrations)గా జరుపుకుంటాం. ఇందులో పెళ్లి ఊహాగానాలు అనవసరం. నాకు పెళ్లి అప్పుడే జరగదు. నాకు 24 ఏళ్లు.. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చింది” ఈ డ్యాన్సింగ్ క్వీన్. కాగా శ్రీలీల తాజాగా ‘జూనియర్(Junior)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరీటి(Kireeti) హీరోగా నటించిన ఈ చిత్రంలో జెనీలియా(Genelia) ప్రధాన ప్రాతల్లో నటించి మెప్పించింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందీ బ్యూటీ.
#Junior is getting rave reviews for its wholesome entertainement, with #Kireeti impressing all with his energetic fight scenes & captivating dance moves. His chemistry with #Sreeleela is lit on screen.@KireetiOfficial @geneliad @sreeleela14 @PROSaiSatish pic.twitter.com/3NGZcUV62r
— S K R (@skrcinepro) July 18, 2025