Ramprasad: జబర్దస్త్‌ రామ్‌ప్రసాద్‌కు ప్రమాదం

Mana Enadu : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం (Thukkuguda Road Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో జబర్దస్త్‌ కమెడియన్‌ రామ్‌ ప్రసాద్‌ (Jabardast Ramprasad) గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.

ఇవాళ మధ్యాహ్నం రామ్ ప్రసాద్ షూటింగ్‌ స్పాట్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో ఔటర్‌ రింగు రోడ్డుపైకి కారు రాగానే ఆయన సడన్‌ బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న మరో వాహనం ఆ కారును ఢీ (Ram Prasad Accident) కొట్టింది. దీంతో ముందున్న కారును రామ్‌ ప్రసాద్‌ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు కారు ధ్వంసమైంది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే రామ్ ప్రసాద్ ను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ధ్వంసమైన వాహనాన్ని అక్కడి నుంచి తరలించారు. రామ్ ప్రసాద్ ప్రమాదానికి గురయ్యారని తెలిసి అభిమానులు (Ram PRasad Fans) ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

జబర్దస్ రామ్ ప్రసాద్ గురించి తెలియని వారుండరు. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర కార్యక్రమాల ద్వారా ఇతను ప్రేక్షకులకు సుపరిచతమే. ఈ షోలలో వచ్చిన ఫేమ్ తో రామ్ ప్రసాద్ కు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోల సినిమాలో కూడా రామ్ ప్రసాద్ నటించాడు. ఇక రైటర్ గానూ ఈయన సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *