వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు రోజులపాటు సమీక్షలు చేయనున్నారు. ఈ మేరకు మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు జగన్ రూట్ మ్యాప్(Jagan Route map) సిద్ధం చేశారట. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ బలోపేతం, కార్యకర్తలలో ఉత్సహాన్ని తెచ్చేందుకు జగన్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
కార్యకర్తలతో మమేకమవుతా: జగన్
‘‘వచ్చే సంక్రాంతి(Sankranti) తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. జనవరి నుంచి మొదలు పెడతాను. ప్రతి బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటాను. ప్రతి పార్లమెంట్‌ను ఒక యూనిట్ కింద తీసుకుని నేనే అక్కడికి వచ్చి బస చేస్తాను. బుధవారం అంతా 3నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో 4 నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకం అవుతా. పూర్తిగా కార్యకర్తలకే కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం.అక్కడే ఉంటూ, కార్యకర్తలతో మమేకం అవుతూ, కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం’’ అని జగన్ తెలిపారు.
పార్టీ బలోపేతానికి ఏర్పాట్లు
ఇక ఆయా కార్యక్రమాలకు తగ్గట్లుగానే పేర్లు కూడా పెట్టారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేర్లతో ముందుకు వెళ్తామని YCP పేర్కొంది. ఆ ప్రోగ్రామ్ ముఖ్య ఎజెండా మండల స్థాయి కల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది. పార్టీ పటిష్ఠత కోసం కమిటీలు ఏర్పాటైతే క్షేత్రస్థాయిలో మళ్లీ బలంగా తిరిగి రావొచ్చని YCP భావిస్తోంది. జగన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే సమయానికి మండల స్థాయిలో అన్ని కమిటీలు(Mandal level committees) ఏర్పాటు చేసేందుకు పార్టీ యంత్రాంగం సిద్ధమైంది. ఈమేరకు నియోజకవర్గ నేతలను జగన్ ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను- YS Jagan Mohan Reddy
ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను.
రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతాను.
పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాను.కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా pic.twitter.com/vL9HePMyup
— Ravi Aluri (@RaviAluri419504) November 29, 2024