ఆ అద్భుతాన్ని అవతార్-3లో చూస్తారు : జేమ్స్‌ కామెరూన్‌

‘‘సినిమా లవర్స్ అంచనాలకు మించి అవతార్-3 (Avatar-3) సినిమా ఉంటుంది. ఈసారి మేం అందించబోయే విజువల్ వండర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గత రెండు సినిమాల్లో చూసినవి రిపీట్ కాకుండా మూడో పార్ట్ తెరకెక్కిస్తున్నాం. కొన్ని అడ్వెంచర్స్ తో మీ ముందుకు రాబోతున్నాం. సాహసం చేయకపోతే ప్రేక్షకుల సమయం, డబ్బు వృథా చేసిన వాడిని అవుతాను.” అంటూ అవతార్ ప్రపంచాన్ని సృష్టించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు.

విజువల్ వండర్

జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘అవతార్’ మూడో భాగం భారీ అంచనాల మధ్య రూపొందనుంది. ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar Fire And Ash) పేరుతో రానున్న ఈ సినిమాపై జేమ్స్‌ కామెరూన్‌ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత రెండు భాగాల్లో లేని అద్భుతాలను అవతార్‌ మూడో పార్ట్‌లో చూపిస్తామని అన్నారు.  ప్రేక్షకుల అంచనాలకు మించిన లైవ్‌-యాక్షన్‌ను.. మరో కొత్త ప్రపంచం భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలతో పార్ట్-3 రూపొందిస్తున్నట్లు చెప్పారు.

డిసెంబరులో రిలీజ్

ఇక కామెరూన్ సృష్టించిన అవతార్ ప్రపంచం గురించి మాట్లాడుకుంటే..  పండోర (Pandora Planet) అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను దిమ్మ దిరిగే విజువల్స్ తో ప్రేక్షకులకు చూపించారు. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో సెకండ్ పార్ట్ తీసి మరో వండర్ క్రియేట్ చేశారు. ఇక  ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్ని కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నారు. 2025 డిసెంబరు 19న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *