వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో అవతార్ (Avatar) ఫ్రాంఛైజీ టాప్ టెన్ లో తప్పకుండా ఉంటుంది. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన అవతార్-1 విజువల్ వండర్ గా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పండోరా అనే కొత్త గ్రహాన్ని అద్భుతంగా సృష్టించి వండర్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఇక ఆ తర్వాత వచ్చిన అవతార్ పార్ట్-2 కూడా అంతే వండర్ చేసింది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా రాబోతోంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar : Fire And Ash)’ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా కామెరూన్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
పార్ట్-3 చాలా స్పెషల్
సినిమాకాన్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameroon) తొలి రెండు సినిమాలతో పోలిస్తే మూడో పార్ట్ ఎంతో ఆసక్తిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు చూసిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా స్పెషల్‌గా ఉంటుందని చెప్పారు. ఫస్ట్ రెండు భాగాల్లో జేక్ ఫ్యామిలీ, మానవ ప్రపంచంతో పోరాటం చేసింది. పార్ట్ 3లో కొత్త విలన్స్ పుట్టుకొస్తారు. యాష్ ప్రపంచంలోని తెగలతోనూ జేక్ కుటుంబం పోరాటం చేస్తుంది. తొలి పార్ట్‌లో భూమి, రెండో భాగంలో సముద్రం, పార్ట్-3లో చంద్రుడిపై యుద్ధాన్ని చూడబోతున్నారు. అవతార్-3 మూవీని ప్రేక్షకులు తప్పక ఆస్వాదిస్తారు. ఈసారి మరో అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.
డిసెంబరులో అవతార్-3 రిలీజ్
ఇక అవతార్-3 సంగతికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబరులో ఈ మూవీ రిలీజ్ (Avatar 3 Release Date) కానుంది. ఇక పండోరా అనే కల్పిత గ్రహాన్ని క్రియేట్ చేసి అవతార్ సినిమాతో విజువల్ వండర్ ను ప్రపంచానికి పరిచయం చేశారు జేమ్స్ కామెరూన్. ఆ తర్వాత ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’తో సముద్రంలో వార్ చూపిస్తూ మరో విజువల్ ట్రీట్ అందించారు. ఇక ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచ భూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చంద్రుడిపై రూపొందిస్తున్నారు. 2025 డిసెంబరు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.






