తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ(Cooli)’. ఫేమస్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ మరోసారి తన మాస్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్(posters), సాంగ్ ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర, శ్రుతిహాసన్(Shruti hasan) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్(Poster)ను విడుదల చేశారు.
#Coolie releasing on 14th August 2025💥💥💥#CoolieFromAug14@rajinikanth @iamnagarjuna @shrutihaasan @hegdepooja @Dir_Lokesh @anirudhofficial @anbariv @sunpictures pic.twitter.com/I4PA9Y3iSR
— Mango TeluguCinema (@TeluguCinema7) April 4, 2025
వార్-2తో కూలీ ఢీ
కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్(Release) చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఓ సాలిడ్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. అందులో రజనీకాంత్ విజిల్ వేస్తూ కనిపించారు. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

దీంతో ఈ ఏడాది ఆగస్టులో బాక్సాఫీస్(Box Office) దగ్గర బిగ్ వార్ జరగనుంది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్లు ఇప్పటికే బాలీవుడ్ క్రేజీ స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్-2(War-2)’ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే రోజున రజినీకాంత్ ‘కూలీ’ వస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర వార్ జరగడం ఖాయమని అభిమానులు అంటున్నారు.






