తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు లైన్ క్లియర్

తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఈ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో గ్రూప్​-1 అభ్యర్థులు  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది.

నియామకాలకు లైన్ క్లియర్

అయితే ఈ జీవోను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేయగా ఇవాళ ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్​ -1 జనరల్​ ర్యాంకింగ్​ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నియామకాలకు లైన్ క్లియర్ కావడంతో.. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది. ఇక ఇప్పటికే మార్చి 30వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్​-1 జీఆర్​ఎల్​ జాబితాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

వెబ్ సైట్ లో ర్యాంకులు

మొత్తం 563 గ్రూప్​-1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 10వ తేదీన టీజీపీఎస్సీ.. గ్రూప్​-1 ప్రొవిజినల్​ మార్కులు విడుదల చేసింది. అర్హత సాధించిన 12,622 మందికి సంబంధించి మార్చి 30వ తేదీన జీఆర్ఎల్ లిస్టు రిలీజ్ చేసింది. గ్రూప్​-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చు. ఇక గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలో  టాప్​ 10లో ఆరుగురు మహిళలు ఉన్నారు.

Related Posts

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *