ఒకప్పటి స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్(Janvi Kapoor). తన అందం, టాలెంట్‌తో వరుస ప్రాజెక్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అటు బాలీవుడ్(Bollywood)లోనూ.. ఇటు టాలీవుడ్(Tollywood)లోనూ పలు మూవీస్‌లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవర(Devara) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ సినిమా సీక్వెల్ లోనూ నటించనుంది. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) మూవీ పెద్ది(Peddi)లో నటిస్తోంది. బుచ్చిబాబు సనా(Bucchibabu Saana) తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది.

దేవర మూవీకి రూ.5 కోట్లు అందుకున్న జాన్వీ
ఇక జాన్వీ రెమ్యునరేషన్(Remunaration) విషయానికొస్తే.. దేవర మూవీకి రూ.5 కోట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెద్ది సినిమాకు ఏకంగా రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగులో రెండో చిత్రానికే కోటి రూపాయలు పెంచిందని సమాచారం. అల్లు అర్జున్-అట్లీ(Allu-Atlee Movie) కాంబోలోని ఓ రోల్ కోసం మేకర్స్ ఇటీవల జాన్వీ కపూర్‌ను సంప్రదించారట. దీంతో ఈ మూవీకి మరో రూ.కోటి పెంచేసి మొత్తంగా రూ.7 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

దీంతో ఆమెను మూవీలోకి తీసుకుంటే.. ఉత్తరాదిలోనూ బెనిఫిట్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే కాస్త రెమ్యునరేషన్ తగ్గించమని ఆమెతో చర్చలు జరుపు తున్నట్లు సమాచారం. కానీ ఈ భామ మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నట్లు బాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.






