బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) టాలీవుడ్(Tollywood)లో అడుగుపెట్టిన చాలా తక్కువ టైమ్‌లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఓ వైపు హిందీ సినిమాలు, మరోవైపు తెలుగు సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) ‘దేవర (Devara)’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి.

రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా(Buchi Babu Saana) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నాని(Naani) సరసన జాన్వీ నటించబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలాడుతున్నారు.

జాన్వీ సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంది. గత కొన్ని నెలలుగా బిజినెస్‌మేన్ శిఖర్ పహారియా((Business Man Shikhar Pahariya)తో ఆమె ప్రేమలో ఉందన్న వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వారి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతుంది.

తాజాగా జాన్వీ తన ప్రేమను మరోసారి పబ్లిక్‌గా బయటపెట్టింది. ఇటీవల ఆమె కస్టమ్ మేడ్ టీ-షర్ట్ ధరించి కనిపించింది, అది ప్రత్యేకంగా శిఖర్ పహారియ ఫొటోలతో ప్రింట్ చేయబడింది. అంతే కాకుండా, ఆ టీ-షర్ట్‌పై శిఖర్ షర్ట్‌లెస్ ఫోటో కూడా ఉండడం విశేషం. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు “జాన్వీ పూర్తిగా ప్రేమలో మునిగిపోయింది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.






