Janvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ.. లండన్ వెళ్లినా దొరికిపోయారుగా!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janvi Kapoor) తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా(Shikhar Pahariya)తో కలిసి లండన్‌(London)లో పర్యటిస్తోంది. ఇటీవల సినిమాల నుంచి కాస్త విరామం దొరకడంతో, ఆ సమయాన్ని ఆమె తన ప్రియుడితో గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ జంట ముంబై(Mumbai)లోని రెస్టారెంట్ల వద్ద, తిరుమల శ్రీవారి దర్శన సమయంలోనూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వీధుల్లో కలిసి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ సరసన నటిస్తున్న జాన్వీ

కాగా, ప్రైవసీ కోసం లండన్ వెళ్లినా, అభిమానుల కంటపడకుండా జాన్వీ తప్పించుకోలేకపోయారు. ఈ వీడియో(Video) చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది(Peddi)’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, జాన్వీ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *