తమిళ హీరో జయం రవి (Jayam Ravi), గాయని కెనీషా (Keneesha) మరోసారి వార్తల్లో నిలిచారు. మెడలో దండలతో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. వారిద్దరు పూల దండలు కనిపించడంతో.. పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు కోడై కూస్తున్నారు. వీరిద్దరు కొద్దికాలంగా రిలేషన్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తన నిర్మాణ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను జయం రవి గురువారం ఆవిష్కరించగా.. ఈ ప్రకటనకు ముందు ఆయన, కెనీషా కలిసి ఓ దేవాలయాన్ని సందర్శించారని, ఆ సందర్భంగానే అర్చకులు పూల దండలు వేసినట్లు సమాచారం.
కోర్టులో రవి, ఆర్తి విడాకుల కేసు
జయం రవి తన భార్య ఆర్తి(Arthi) నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు గతేడాదే ప్రకటించారు. అయితే కెనీషాతో రిలేషన్ వల్లే ఆర్తికి డివోర్స్ ఇచ్చారంటూ కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు రవి, కెనీషా జంటగా హాజరవడం, కలిసి తిరగడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. తాజాగా వీరిద్దరు మెడలో దండలతో కనిపించడంతో పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జయం రవి, ఆర్తి విడాకుల కేసు(divorce case) ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.






