అలనాటి సీనియర్ నటి జయసుధకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ(Gaddar Telangana Film Awards Jury Committee) ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Jayasudha) ఎంపిక చేసింది. మొత్తం పదిహేను మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని FDC ఏర్పాటు చేసింది. జయసుధ, FDC MD హరీశ్‌లతో ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు(Chairman Dil Raju) ఈ మేరకు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడారు.

ఎంపిక ప్రక్రియను సజావుగా సాగాలి
నామినేషన్ల(Nominations)ను నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచించారు. ఎంపిక ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డుల(Film Awards)కు ఇంతటి స్పందన రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గద్దర్ అవార్డుల(Gaddar Awards) కోసం దాఖలైన కాగా నామినేషన్లను ఈ నెల 21వ తేదీ నుంచి జ్యూరీ(Jury) పరిశీలించనుంది. తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి 1,248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత కేటగిరీలో 1,172, ఫీచర్ ఫిల్మ్, చిల్ట్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
Gaddar Telangana Film Awards Jury Meeting Held under the Chairmanship of Actress #Jayasudha
A total of 1,248 nominations have been received across all categories for the #GaddarAwards
1172 Nominations in Individual Categories for #Gaddar Awards
76 Nominations in… pic.twitter.com/eHb78fEk5E
— Surya Reddy (@jsuryareddy) April 16, 2025






