
ఐపీఎల్ 2025లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచులో ఎలాంటి మార్పులు లేవని గత మ్యాచ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) టాస్ సమయంలో చెప్పాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
Match 32@DelhiCapitals vs @rajasthanroyals 🔥🔥
🚨 Toss 🚨@rajasthanroyals won the toss and elected to bowl against @DelhiCapitals
DC 👉 Unchanged 💙
RR 👉 Unchanged 🩷#TATAIPL | #DCvRR #RRvDC #IPL— A2ZCRICKET (@a2zcric) April 16, 2025
సమవుజ్జీల సమరంలో గెలిచేదెవరో..
ఇదిలా ఉండా ప్రతి సీజన్లోనూ IPL పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండే RR ఈ సారి చతికిలపడింది. 6 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ఇక DC ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతోంది. 5మ్యాచుల్లో 4 విజయాలు సాధించి సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 29 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లలో గెలిచింది. దాదాపు సమవుజ్జీలుగా ఉన్న ఈ జట్లలో నేడు విజయం ఎవరిని వరించనుందో..
తుది జట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ
Rajasthan Royals will bowl first against Delhi Capitals in the 32nd match of IPL 2025.
Here are the playing XI of both sides 🏏#IPL2025 #DCvsRR #AxarPatel #SanjuSamson #CricketTwitter pic.twitter.com/lT6iPp886G
— InsideSport (@InsideSportIND) April 16, 2025