Independence Day Campaign: అన్ని మూవీలు ఫ్రీగా చూడొచ్చు.. JioHotstar బంపర్ ఆఫర్

79వ ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా యూజర్లకు జియో హాట్‌స్టార్(Jio Hotstar) ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రేపు (ఆగస్టు 15) జియో హాట్‌స్టార్ తమ మొత్తం కంటెంట్ లైబ్రరీని 24 గంటల పాటు ఉచితం(Free)గా అందుబాటులో ఉంచనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా, సినిమాలు(movies), టీవీ షో(Tv Shows)లు, క్రీడలతోపాటు ఇతర కంటెంట్‌ను సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా అందరూ చూడవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ అంటూ భాషా భేదం లేకుండా ఆల్ లాంగ్వేజస్‌లో ఉన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు మొత్తం కంటెంట్‌ను పబ్లిష్ చేయనుంది. ‘ఆపరేషన్ తిరంగ(Operation Tiranga)’ అనే పేరుతో ఆడియన్స్‌కు అందించనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఆగస్టు 15వ తేదీ రోజు మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించింది.

JioHotstar Launches 'Operation Tiranga' with Free All-Day Streaming on  Independence Day – Made-in-Media: Crafting Stories, Shaping Perspectives

‘తిరంగా ఏక్, కహానియా అనేక్’ పేరిట కలెక్షన్

ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, ‘తిరంగా ఏక్, కహానియా అనేక్ (One is Tiranga, another is Kahaniya)’ అనే క్యూరేటెడ్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ కలెక్షన్‌లో భారత జాతీయ జెండా రంగులను సూచించే సినిమాలు ఉన్నాయి. కాషాయ రంగు (సఫ్రాన్) కింద ‘టేక్ ఆఫ్’, ‘మద్రాస్ కేఫ్’, ‘ఐబీ71’ వంటి ధైర్యసాహసాల కథలు; తెలుపు రంగు కింద ‘సలాకర్’, ‘నీర్జా’, ‘మంగళ్ పాండే’ వంటి త్యాగధర్మ కథలు ఉండగా.. ఆకుపచ్చ రంగు కింద ‘సర్జమీన్’, ‘కేసరి 2’, ‘ఎయిర్‌లిఫ్ట్’ వంటి సాంస్కృతిక గర్వాన్ని చాటే చిత్రాలు ఉన్నాయి.

ధైర్యం, త్యాగం, గుర్తింపును ప్రతిబింబించేలా..

ఈ సందర్భంగా జియో హాట్‌స్టార్ బ్రాండ్ & క్రియేటివ్ హెడ్ మినాక్షీ ఆచన్(Meenakshi Achan) మాట్లాడుతూ, “ఈ ఆఫర్ ద్వారా దేశ ధైర్యం, త్యాగం, గుర్తింపును ప్రతిబింబించే కథలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము” అని తెలిపారు. ఈ కార్యక్రమం టెలివిజన్, డిజిటల్ మీడియా(Digital Media), బహిరంగ ప్రకటనల ద్వారా ప్రచారం చేయబడుతుంది. అంతేకాక, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting)తో కలిసి జాతీయ జెండా(National flag) గౌరవాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, జియో హాట్‌స్టార్ ఈ ఆఫర్‌తో భారతీయులందరికీ వినోదం, దేశభక్తిని అందిచనుంది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *