రిలయన్స్ జియో తన డిజిటల్ విభాగం ద్వారా వినియోగదారులకు మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. “జియోపీసీ” పేరుతో ప్రారంభించిన ఈ క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీస్ ద్వారా, టీవీని కంప్యూటర్‌లా ఉపయోగించే అవకాశం కల్పిస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీని జియో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాక, కొత్త వినియోగదారులకు ఇన్విటేషన్ ప్రాతిపదికన ఫ్రీ ట్రయల్ కూడా అందిస్తున్నారు. కాగా, విడిగా కొనుగోలు చేయాలనుకుంటే దీని ధర రూ.5,499.
ఈ పీసీని ఉపయోగించాలంటే జియో సెట్-టాప్ బాక్స్‌కు తోడు కీబోర్డ్, మౌస్ అవసరం. టీవీకి జియో సెట్-టాప్ బాక్స్ కనెక్ట్ చేసి, జియోపీసీ యాప్ ద్వారా వర్చువల్ డెస్క్‌టాప్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఈ విధంగా ఇంటర్నెట్‌తో పని చేసే ఓ పూర్తి కంప్యూటర్ అనుభూతిని సాధించవచ్చు.
జియోపీసీ ఉపయోగాలు:
విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు, ఎడ్యుకేషన్ టూల్స్
సాధారణ బ్రౌజింగ్, ఓపెన్ సోర్స్ లైబ్రే ఆఫీస్ (ఇన్‌బిల్ట్)
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్స్‌ను బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసే అవకాశం
ప్రస్తుతం కెమెరాలు, ప్రింటర్లు వంటి పిరిఫెరల్స్‌కు అనుసంధానం సపోర్ట్ చేయదు. అయితే, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా క్లౌడ్ ఆధారిత పీసీగా ఇది పనిచేస్తుంది.
మార్చిలో జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించినట్టు, “జియోపీసీ” ద్వారా డిజిటల్ ఇండియాకి మరింత మద్దతు లభించనుంది. పూర్తి వివరాల కోసం జియో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.







