పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ బంపర్ ప్లాన్.. రూ.6 లక్షలు మీ ఖాతాలోకి!

ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రం(Financial Security)గా ఉంచేందుకు ముందుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి(Middle Class) కుటుంబాలు నెలకొకసారి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పిల్లల కోసం పొదుపుగా మలుస్తున్నారు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposit)పై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో, ఎక్కువ మంది పోస్టాఫీస్(Post Office Scheme) పథకాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందులో ప్రముఖ పథకం బాల్ జీవన్ భీమా యోజన(Bal Jeevan Bheema Yojana Scheme).

బాల్ జీవన్ భీమా యోజనలో ప్రత్యేకతలు:

ఈ స్కీమ్‌లో రోజుకు కేవలం రూ.6 నుంచే పొదుపు ప్రారంభించవచ్చు. దీని ద్వారా మెచ్యూరిటీ సమయంలో కనీసం రూ.1 లక్ష వరకు హామీ పొందవచ్చు. మరింత పొదుపు చేయాలనుకునేవారు రోజుకు రూ.18 దాకా సేవ్ చేస్తే, రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల స్థోమతను బట్టి రోజువారీ పొదుపు నిర్ణయించుకోవచ్చు.

అర్హతలు:

ఈ పథకం కేవలం పిల్లల పేర్లపై మాత్రమే తీసుకోవాలి.

పిల్లల వయస్సు 5 నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి.

తల్లిదండ్రుల వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.

ఇద్దరు పిల్లల వరకే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

కాబట్టి, రోజుకు రూ.36 పొదుపుతో, ఇద్దరు పిల్లలకూ కలిపి రూ.6 లక్షల వరకు పొందవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ:

ఈ పథకంలో చేరాలంటే, మీ ఇంటికి సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అర్హతలుంటే, అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి పొదుపు ప్రారంభించవచ్చు. గుర్తింపు మరియు అడ్రస్ ప్రూఫ్‌లను సమర్పించడం తప్పనిసరి.

పిల్లల చదువు, పెళ్లిళ్లు, లేదా భవిష్యత్తులో ఇతర అవసరాల కోసం ముందస్తుగా ఈ విధంగా సేవ్ చేయడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చు. బ్యాంకులతో పోలిస్తే పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీ రాబడితో పాటు ప్రభుత్వ హామీ కూడా ఉంటుందన్నది ప్రత్యేక ఆకర్షణ.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *