Joe Root embraces his Dad after walking off at Lord’s as England’s top century-maker
Mana Enadu: ఇంగ్లండ్(England) సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) టెస్టుల్లో దుమ్ములేపుతున్నాడు. శ్రీలంక(Srilanka)తో జరుగుతున్న టెస్టు సిరీస్(Test Series)లో శతకాల(Centuries) మోత మోగిస్తున్నాడు. లాడ్స్(Lord’s)లో జరుగుతున్న రెండో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఈ వెటరన్ ప్లేయర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ మూడంకెల స్కోరు సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన చరిత్ర సృష్టించారు. దీంతో తన టెస్ట్ కెరీర్లో 34వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్(Alister Cock 33 సెంచరీలు) రికార్డును బ్రేక్ చేశారు. అత్యధిక టెస్టు శతకాలు చేసిన ఇంగ్లిష్ ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ జాబితాలో రూట్, కుక్ తర్వాత కెవిన్ పీటర్సన్ (23), వాలే హమోండ్ (22), కోలిన్ కోడ్రే (22) ఉన్నారు. వీరిలో రూట్ ఒక్కడే ప్రస్తుతం ఆడుతున్నాడు.
మరోవైపు ఇంగ్లండ్ తరఫున 50 ఇంటర్నేషనల్ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇంగ్లిష్ ప్లేయర్‌గానూ రూట్ ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 34 సెంచరీలు చేసిన 33 ఏళ్ల రూట్.. వన్డేల్లో 16 సెంచరీలు చేశాడు. దీంతో 50 ఇంటర్నేషనల్(International) సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ శతకాలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ల జాబితాలో రూట్ తర్వాత కుక్ (38), కెవిన్ పీటర్సన్ (32), గ్రహం గూచ్ (28), ఆండ్రూ స్ట్రాస్ (27) ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలో టెస్టు సెంచరీల విషయంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా(B Lara)ను జో రూట్ సమం చేశాడు. వారిద్దరూ కూడా 34 టెస్టు సెంచరీలను చేయగా.. రూట్ ఇప్పుడు ఆ మార్క్‌ను అందుకున్నాడు. జో రూట్ నాలుగేళ్లుగా టెస్టు క్రికెట్లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 44 నెలల్లోనే 17 టెస్టు సెంచరీలు చేశాడు. కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అటు బౌలింగ్‌లోనూ రూట్ విజృంభిస్తున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే
* సచిన్ టెండూల్కర్ (51) సెంచరీలు (200 మ్యాచుల్లో), IND
* జాక్వెస్ కలిస్ (45) సెంచరీలు (166 మ్యాచుల్లో), SA
* రికీ పాంటింగ్ (41) సెంచరీలు (168 మ్యాచుల్లో), AUS
* కుమార సంగాక్కర (38) సెంచరీలు (134 మ్యాచుల్లో), SL
* రాహుల్ ద్రవిడ్ (36) సెంచరీలు (164 మ్యాచుల్లో), IND
* యూనిస్ ఖాన్ (34) సెంచరీలు(118 మ్యాచుల్లో), PAK
* సునీల్ గవాస్కర్ (34) సెంచరీలు(125 మ్యాచుల్లో), IND
* బ్రియాన్ లారా (34) సెంచరీలు(131 మ్యాచుల్లో), WI
* జయవర్ధనే (34) సెంచరీలు (149 మ్యాచుల్లో), SL
* జో రూట్ (34*) సెంచరీలు(145 మ్యాచుల్లో), ENG
* కోహ్లీ (29*) సెంచరీలు (113 మ్యాచుల్లో), IND