NTR: యమదొంగ రీరిలీజ్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో మరో సూపర్ హిట్ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) నటించిన మూవీ ‘యమదొంగ(Yamadonga)’ చిత్రాన్ని ఎన్టీఆర్ బర్త్ డే(NTR B’day) స్పెషల్‌గా మే 18న రీరిలీజ్(Rerelease) చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో(Rajamouli-NTR combo)లో వచ్చిన మూడో సినిమా ఇది. యమదొంగకు ముందు ఎన్టీఆర్ కాస్త డౌన్ ఫాల్‌లో ఉన్నాడు. రాజమౌళి కాంబోతో ఉన్న క్రేజ్‌తో పాటు యముడుగా మోహన్ బాబు(Mohan Babu) చేసిన పాత్ర ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యింది. యముడు, చిత్రగుప్తుడు, మానవుడు అనే కాన్సెప్ట్‌లోనే ఇప్పటి వరకూ వచ్చిన చాలా సినిమాల టెంప్లేట్ నే రాజమౌళి మరోసారి ఫాలో అయ్యాడు. యముడుగా NTR చేసిన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

కంప్లీట్ కమర్షియల్ ప్యాక్‌

ప్రియమణి(Priyamani) హీరోయిన్‌గా నటించిన యమదొంగలో రంభ(Rambha) చేసిన ఐటెమ్ సాంగ్, ఆ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు విజిల్స్ వేయించాయి. అలాగే మమతా మోహన్(Mamatha Mohandas) దాస్ స్పెషల్ రోల్ సైతం అదిరిపోయింది. అలీ కామెడీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా కంప్లీట్ కమర్షియల్ ప్యాక్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న NTR బర్త్ డే స్పెషల్‌గా 18నే రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *