
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో KKR ఓ మోస్తరు స్కోరు సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న KKR నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తప్పక నెగ్గాల్సిన మ్యాచులో కేకేఆర్‌కు బ్యాడ్ ఓపెనింగ్ దక్కింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (11) త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన సునీల్ నరైన్ (26) దూకుడుగా ఆడినా, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ (1) కూడా నిరాశపరిచాడు.
71 పరుగులకే 3 వికెట్లు
ఒకానొక దశలో 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన KKRను కెప్టెన్ రహానే ఆదుకున్నాడు. అతనికి రస్సెల్ (38 పరుగులు), మనీష్ పాండే (36*) తోడవడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. చివర్లో రింకూ సింగ్ (9) వేగంగా ఆడే ప్రయత్నంలో నూర్ అహ్మద్(Noor Ahmed) బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. రమణ్‌దీప్ సింగ్ (4*) అజేయంగా నిలిచాడు. CSK బౌలర్లలో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంభోజ్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో వికెట్ దక్కించుకున్నారు.
Second Half-ல் சரவெடியான Chasing நமக்காக காத்திருக்கு! 💥🙌🏼
📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | KKR vs CSK | JioHotstar & Star Sports தமிழில்#IPLOnJioStar #IPL2025 #TATAIPL #KKRvCSK #IPLRace2Playoffs pic.twitter.com/ln9MCeedni
— Star Sports Tamil (@StarSportsTamil) May 7, 2025