తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరయిన్ లకు హిట్స్ లేకపోయినా క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అందం, నటన, డ్యాన్స్ స్కిల్స్ కలగలిసిన వారికి అవకాశాలు కూడా వెనువెంటనే దక్కుతుంటాయి. అలాంటి లిస్టులో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) కూడా చేరిపోయిందనే చెప్పాలి.
తక్కువ సినిమాల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ప్రేక్షకులను తన గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే, ఆమె నటించిన సినిమాలకు పెద్దగా విజయాలు దక్కకపోయినా, నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీని తమ చిత్రాల్లో తీసుకోవడానికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్(Remuneration) ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో కేవలం ఒకే ఒక తెలుగు చిత్రం ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్(Harish shankar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉత్సాద్ భగత్ సింగ్ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. అంతకు ముందు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న “లేనిన్” సినిమాలో నటించాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
View this post on Instagram
తెలుగులో అవకాశాలు తగ్గినా, శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ‘పుష్ప 2’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ద్వారా ఆమెకు హిందీ ప్రేక్షకుల మధ్య మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవడానికి హిందీ చిత్ర దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు.
ఇప్పటికే ఒక తెలుగు సినిమాకు శ్రీలీల దాదాపు రూ.2 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే తాజాగా హిందీ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.5 కోట్లు వరకు పారితోషకం ఇవ్వబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయాలతో సంబంధం లేకుండానే ఇలా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్‌లతో పోటీ పడుతోందంటే, శ్రీలీల క్రేజ్ ఎలాంటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.






