Supreme Court: సుప్రీంకోర్టు CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం

ManaEnadu: భారత సుప్రీంకోర్టు(Supreme Court of India) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్(Justice DY Chandrachud) పదవీ కాలం ముగియడంతో ఆయన కొత్త CJIగా ఎంపికయ్యారు. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 వంటి కేసుల్లో కీలక తీర్పునిచ్చిన సంజీవ్ ఖన్నా దేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆయనచే ప్రమాణం చేయించారు. కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆరేళ్ల పాటు 117 తీర్పులు రాసిన సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు CJIగా ఉంటారు.

 అపార అనుభవం

జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబం నుంచే వచ్చారు. అతని తండ్రి దేవరాజ్ ఖన్నా(Devaraj Khanna) ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి(Judge of the Delhi High Court)గా పనిచేయగా, పెద్దనాన్న HR ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1983లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌(Bar Council)లో నమోదు చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అలా 2005లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పుల్లో జస్టిస్ ఖన్నా కూడా ఒక సభ్యుడు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిలో కీలక తీర్పు ఇచ్చారు. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi Ex Cm Arvind Kejriwal) మనీ లాండరింగ్ కేసులో కూడా అతనికి మధ్యంతర బెయిర్ మంజూరు చేశారు.

 న్యాయవృత్తి మీద ఆసక్తితో

జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పెద్దనాన్న జస్టిస్ హెచ్‌.ఆర్.ఖన్నా తీర్పులతో స్ఫూర్తి పొందారట. తండ్రి అకౌంటెంట్‌లోకి పంపించాలనుకున్నా.. కానీ న్యాయవృత్తి మీద ఆసక్తితో ఇందులోకి రావడానికి ఇష్టపడ్డారు. కాగా భారత ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2 లక్షల 80 వేలు జీతం ఇస్తారు. సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులకు నెలకు రూ.2 లక్షల 50 వేలు, దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులందరికీ నెలకు రూ.2 లక్షల 50 వేలు జీతం ఇస్తున్నారు. ఇది కాకుండా హైకోర్టు(High Court)లోని ఇతర న్యాయమూర్తులకు నెలకు రూ.2 లక్షల 25 వేలు వేతనం ఇస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *