Mana Enadu : టాలీవుడ్ యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ (KA Movie)తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచే గాక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తమకు నచ్చిందని.. క్లైమాక్స్‌ను అస్సలు ఊహించలేకపోయానని ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ప్రశంసించారు. అల్లు అరవింద్, దిల్‌రాజుతోపాటు పలువురు సినీ ప్రముఖులు విజయం పట్ల అభినందనలు తెలిపారు.
క టీమ్ ను కలిసిన చిరంజీవి
మరోవైపు తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఈ చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆదివారం తన నివాసంలో క మూవీ టీమ్ ను ప్రత్యేకంగా కలిశారు. సుజీత్, సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటులను ప్రశంసించారు. ఈ సినిమా గురించి పలు విషయాలపై వారితో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ అబ్బవరం తాజాగా ఎక్స్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసి ఎమోషనల్ మెసేజ్ చేశారు.
థాంక్యూ చిరంజీవి సార్
Appreciation from the BOSS
Thank you so much @KChiruTweets gaaru for the 1 hour long memorable conversation ❤️
Always feels blessed whenever i meet you sir #KA #DiwaliKAblockbuster pic.twitter.com/9TdAp5hqwT
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 10, 2024
‘‘బాస్ నుంచి ప్రశంసలు. దాదాపు గంటపాటు మాకోసం సమయాన్ని కేటాయించి.. ఎన్నో గొప్ప విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్యూ చిరంజీవి గారు. ఈ భేటీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది’’ అని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఎక్స్ వేదికగా హార్ట్ ఫుల్ మెసేజ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
తొలి పాన్ ఇండియా సినిమా
ఇక క అనే సినిమా సంగతికి వస్తే.. సుజీత్, సందీప్ సంయుక్తంగా రూపొందించారు. వాసుదేవ్ అనే వ్యక్తి ప్రయాణాన్ని తెలియజేసే విధంగా ‘క’ చిత్రాన్ని తెరకెక్కించారు. 1970 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాలో తన్వీ రామ్ (Tanvi Ram) హీరోయిన్‌గా నటించింది. కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం గమనార్హం.