తెలుగు వారిపై కామెంట్స్.. పరారీలో తమిళ నటి కస్తూరి

Mana Enadu : తమిళ నటి కస్తూరి(Kasthuri) వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలుగు వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌ చేసి.. ఇంటికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో కస్తూరికి సమన్లు ఇవ్వడం కష్టంగా మారిందని వెల్లడించారు. 

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం నటి కస్తూరి ఓ రాజకీయ సభలో తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ‘తమిళనాడులో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చేవారు’ అని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో తెలుగు సంఘాలు (Telugu Associations) ఆ కామెంట్స్ ను తీవ్రంగా పరిగణించడంతో తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని  ప్రకటించినా.. ఫలితం లేకుండా పోయింది.

ఫోన్ స్విచ్ఛాఫ్.. ఇంటికి తాళం

మూడు రోజుల క్రితం ఈ వ్యవహారంపై  చెన్నై(Chennai)లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెకు సమన్లు అందజేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాంతో ఆమె పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందనే విషయం ఎవరికీ తెలియదు.

తెలుగులో పని చేస్తూ తెలుగు వారిపైనా దుర్భాషలు

ఇక కస్తూరి అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల(Telugu Audience)కు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించారు. చాలా కాలం తర్వాత ఆమె తెలుగు సీరియల్స్(Telugu Serials) తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. అలా ఓ తెలుగు సీరియల్ లో లీడ్ రోల్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఇలా తెలుగులో ఆఫర్లు పొందుతూ తెలుగు వారినే కించపరడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share post:

లేటెస్ట్