నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అర్జున్ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). డై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయశాంతి (Vijay Santhi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్(Saiee Manjrekar) హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌కి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.
గెట్ రెడీ.. రాత్రి 7.59 గంటలకు
తల్లీకొడుకుల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్(Trailer)ను శనివారం రాత్రి 7.59 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్(Realese) కానుంది.
🚨🚨 Back-to-Back Events for #JrNTR — Fans Are Flying High!
The MAN OF MASSES #JrNTR will grace the
‘𝐀𝐑𝐉𝐔𝐍 𝐒/𝐎 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈’ Pre-Release Event
on April 12th ❤🔥GRAND WORLDWIDE RELEASE — APRIL 18th, 2025#ArjunSonOfVyjayanthi | #NTRFansFestival pic.twitter.com/IWfJ1VzLZi
— CINEMEDIA (@CINEMEDIA009) April 11, 2025
ఇప్పటికే కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్(Teaser) ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు పవర్‌ఫుల్ డైలాగ్‌ల(Powerful Dialogues)తో టీజర్ మెప్పించడంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. కాగా ఈ మూవీలో సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ధర్మంగా ఎదిరించే పాత్రల్లో కళ్యాణ్ రామ్, విజయశాంతి కనిపించనున్నట్లు తెలుస్తోంది.






