BREAKING: ‘పద్మశ్రీ’ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ వనజీవి(Vanajeevi Ramaiah) రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు వనజీవి మృతిపట్ల ప్రకృతి ప్రేమికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం రెడ్డిపల్లి గ్రామానికి దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) తెలంగాణలో కోటి మొక్కలు నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. కోటి మొక్కలు(Millions of Plants) నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.

ఆయన మొక్కలు నాటుతుంటే నవ్వారు..కానీ

కాగా ‘పద్మశ్రీ పురస్కారం(PadmaShri Award) ఇవ్వటం ద్వారా.. నేను మొక్కలు నాటుతుంటే నవ్వినవాళ్లకి నాణ్యమైన సందేశం అందించింది మన భారత ప్రభత్వం. వాళ్లు నవ్వకుండా నమస్తే పెడుతున్నారు. ‘ఈయన ఇందిరాగాంధీనా, రాజీవ్‌గాంధీనా ఊరూరు తిరిగి మొక్కలు నాటుతున్నాడు’ అని నవ్విండ్రు. ‘రోడ్లెమ్మటి ఏస్తే ఈయనకు ఏమొస్తది అసలు బుర్ర పనిచేస్తలేదు’ అని అన్నారు” అని తాను ఎదుర్కొన్న పరిస్థితులను గతంలో రామయ్య వివరించారు. ఆయన దాదాపు 120 రకాల మొక్కల చరిత్రను తేలిగ్గా చెప్పగలరు. ఆయన సేవలను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Goovt) ఆరో తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో చేర్చి తగిన గుర్తింపునిచ్చింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *