మక్కల్ నీది మయ్యం అధినేత, సీనియర్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణానికి వేళయ్యింది. ఈనెల 25వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని MNM అధికారికంగా ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమల్‌హాసన్‌కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ పరిస్థితులలో పెద్దలసభలో కమల్ ప్రమాణ స్వీకారం తేదీ గురించి ఆ పార్టీ కార్యాలయం కూడా ప్రకటించింది.
డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం..
కమల్ హాసన్ 2018లో మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీని స్థాపించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. దీంతో 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం MNMకు ఎగువసభ స్థానం కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్‌ను డీఎంకే రాజ్యసభకు నామినేట్ చేసింది.

పలు ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన MNM
ఎంఎన్‌ఎం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. చెన్నై, కోయంబత్తూరు, మధురైలో ఆ పార్టీ నేతలకు భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలో ఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. కాగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కమల్ హీరో రజినీకాంత్‌ను కలిసి కోరారు.
Kamal Haasan Meets Rajinikanth Ahead of Rajya Sabha Oath-Taking Ceremony#KamalHaasan #Rajinikanth #RajyaSabha #IndianPoliticshttps://t.co/pkwaQUbtWQ
— Munsif News 24×7 (@MunsifNews24x7) July 16, 2025






