ప్రముఖ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), సీనియర్ నటి త్రిష(Trisha) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్(Thug Life)’. AM మణిరత్నం(Director Mani ratnam) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో మరో స్టార్ హీరో శింబు(Simbu) ఓ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5వ తేదీన విడుదలైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే కమల్ తమిళ్-కన్నడ భాష వ్యాఖ్యలతో షాక్ తగిలింది. ఇక మొదటి షోకే బాక్సాఫీస్(Box office) దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ కలెక్షన్లను(Collections) వసూలు చేయడంలో వెనుకబడిపోయింది.
రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఈ మూవీకి తమిళనాడు(Tamilnadu) ఏరియాలో రూ.19.05 కోట్ల కలెక్షన్లు దక్కగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.65 కోట్లు, కేరళలో రూ.1.65 కోట్లు, హిందీతోపాటు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.3.0 కోట్లు , ఓవర్సీస్‌లో రూ.25.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీకి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.25.70 కోట్ల షేర్, రూ. 52.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) దక్కాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్(Pre-release business) జరగగా ఈ మూవీ రూ.106.50 కోట్ల టార్గెట్‌తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.
తమిళనాడు ఏరియాలోనూ నెగిటివ్ టాక్
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో రూ.80.80 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా(Break Even Formula)ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో నెగిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు వస్తాయి అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో కూడా చలికిలబడింది.
@itsokaybruhhh – You’re correct. Vettaiyan gross colln 37 cr. Net collection 31.7 cr
Thuglife just 15.5 cr. Even if u assume and add karnataka 7 cr..(if movie ran in karnatka) it will end up in 22 cr only
Btw vettaiyan did 60 lacs in Hindi. Not 6 lacs
Proofs below pic.twitter.com/0gnW8lgsar
— Blastpower (@TriggerVijayna) June 8, 2025






