గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchibabu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్టు కూడా పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
RC16లో ఇద్దరు కన్నడ నటులు
RC16 చిత్రంలో కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా (Chiranjeevi Sarja) సతీమణి, నటి మేఘనా రాజ్ (Meghana Raj) భాగమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మేఘనా రాజ్ ఇప్పటికే షూటింగులో కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ సినిమాలో ఇప్పటికే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) నటిస్తున్న విషయం తెలిసిందే.
RC16లో మేఘనా రాజ్
ఇక మేఘనా రాజ్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్. ఆమె చిన్నతనం నుంచే పలు సినిమాల్లో నటించింది. అయితే నటుడు చిరంజీవి సర్జాతో వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కరోనా సమయంలో చిరంజీవి గుండెపోటుతో మరణించారు. భర్త మరణం తర్వాత మేఘన మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే RC16 టీమ్ ఆమెను సంప్రదించగా.. తన పాత్ర నచ్చగానే మేఘనా రాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.






