గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు (Buchubabu) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆయన లుక్ టెస్టుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
Look test done ✅
A terrific look locked 🔒Karunada Chakravarthy @NimmaShivanna Garu will soon join the sets of #RC16 and begin shooting for his role ❤️🔥#RamCharanRevolts ✊🔥 pic.twitter.com/qyFWqPcdcv
— RC 16 (@RC16TheFilm) March 5, 2025
శివన్న లుక్ టెస్ట్
ప్రస్తుతం శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) లుక్ టెస్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉండే శివ రాజ్ కుమార్ ఈ మూవీలో చెర్రీతో ఓ కీలక సీక్వెన్స్ లో కనిపించనున్నారట. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రికెట్, కుస్తీ వంటి పోటీలు ఉండనున్నట్లు తెలిసింది. క్రికెట్ కు సంబంధించిన సీన్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
చెర్రీతో శివన్న కుస్తీ
ఇక కుస్తీ పోటీలు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయనేది ఇండస్ట్రీ టాక్. ఇది కాకినాడ నేపథ్యంలో ఉంటాయట. ఇప్పటికే ఈ కుస్తీకి సంబంధించి కొంతమేర షూటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇక ఇప్పుడు శివరాజ్ కుమార్, చెర్రీల మధ్య కుస్తీకి సంబంధించి షూట్ చేయాలట. ఇందుకోసమే తాజాగా శివన్న లుక్ టెస్టు చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు (Divyendu) ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.






