Preity Mukundhan: ప్రభాస్ చాలా స్వీట్: కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్​

భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప (Kannappa) మూవీ మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్​ కనిపించిన 20 నిమిషాలు మాత్రం మూవీకే హైలైట్​. ఇక హీరోయిన్​గా నటించిన ప్రీతి ముకుందన్ (Preity Mukundhan)​ సైతం తన నటన, గ్లామర్​తో ఆకట్టుకుంది. సోషల్​ మీడియాలో తప్ప పెద్దగా బయట కనిపించన ప్రీతి.. తాజాగా పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్​ (Prabhas) గురించి మాట్లాడింది. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుందని కొనియాడింది.

అనుకోకుండా అవకాశం వచ్చింది..

‘కన్నప్ప లాంటి భారీ ప్రాజెక్ట్ అనుకోకుండా అవకాశం వచ్చింది. సవాలుగా రోల్స్​ పాత్రలంటే నాకు ఇష్టం. అవి కష్టంగా ఉన్నప్పటికీ గుర్తింపు తెస్తాయి. అలాంటి రోల్స్​ ఉంటే ఆడిషన్ ఇవ్వడానికి సిద్ధమే. కన్నప్పలో ప్రభాస్​తో  (Prabhas) కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది. ఆయన ప్రత్యేకత స్క్రీన్​పై కూడా స్పష్టంగా కనిపించింది. నిజ జీవితంలోనూ ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ సాధారణంగా ఉంటారు. ఎవరినీ చిన్నచూపు చూడరు. సెట్​లో అందరినీ గౌరవిస్తారు. హి ఈజ్​ సో స్వీట్​’ అని ప్రీతి ముకుందన్ అన్నారు.

శరవేగంగా రాజాసాబ్​ షూటింగ్

ప్రస్తుతం ప్రభాస్​ మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’(The Raja Saab)తోపాటు సందీప్​ వంగా డైరెక్షన్​లో ‘స్పిరిట్​’ (Spirit) మూవీ చేస్తున్నారు. ది రాజాసాబ్​ షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్​ ఆడియన్స్​లో ఆసక్తిని పెంచుతోంది. కుటుంబ నేపథ్యం, ఆత్మల కథతో సాగే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ​ఈ ఏడాది డిసెంబర్​ 25న రిలీజ్​ కానుంది. ఇక స్పిరిట్​ మూవీ వచ్చే ఏడాది అలరించనుంది. ప్రీతి విషయానికొస్తే ఓం భీమ్​ బుష్​తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కన్నప్పతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘మైనే ప్యార్​ కియా’, ‘సర్వం మాయ’, KH15, ‘ఇదయం మురళి’ వంటి పలు దక్షిణాది మూవీలో నటిస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *